Share News

HYDRA: నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో హైడ్రా కేసుల విచారణ

ABN , Publish Date - Mar 13 , 2025 | 08:52 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కేసులకు సంభందించి విచారణను నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ర్టిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో జరపనున్నారు.

HYDRA: నాంపల్లి 9వ చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్డులో హైడ్రా కేసుల విచారణ

- స్పష్టతనిచ్చిన హైకోర్టు

- త్వరలో సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్‌ సిటీ: హైడ్రా పోలీస్‎స్టేషన్‌(Hydra Police Station) ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. స్టేషన్‌లో నమోదయ్యే కేసుల విచారణ ఏ కోర్టులో జరగాలన్నది ఖరారైంది. ఈ మేరకు హైకోర్టు స్పష్టతనిచ్చింది. నాంపల్లి(Nampally)లోని 9వ అదనపు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో హైడ్రా పోలీస్‏స్టేషన్‌లో నమోదయ్యే కేసుల విచారణ జరుగుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నీటి వృథా.. మహిళకు జరిమానా


city4.2.jpg

దీనికి సంబంధించి సర్కారు త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అనంతరం హైడ్రా పోలీస్‌స్టేషన్‌(Hydra Police Station) అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కార్యాలయ ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. వారం, పది రోజుల్లో ప్రారంభోత్సవం ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 08:52 AM