Wife Kills Husband: దారుణం.. కూరగాయల కత్తితో భర్తను చంపేసిన భార్య
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:58 AM
బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు రాను రాను క్షీణించిపోతున్నాయి. దంపతుల మధ్య ఉన్న అనురాగం తగ్గిపోతోంది. జీవితాంతం కలిసి ఉంటామని వివాహ బంధంతో ఒక్కటైన జంటలు క్షణికావేశాలతో తమ భర్త లేదా భార్యల ప్రాణాలను బలితీసుకుంటున్న పరిస్థితి. అనుమానం, వేధింపులు, మద్యానికి బానిస ఇలా ఏదో కారణాలతో భర్తపై భార్య , భార్యపై భర్త దాడులు చేస్తూ తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. ఇలాంటి వారి కారణంగా వీరికి పుట్టే పిల్లలు అనాధలుగా మారిపోతున్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తపై భార్య కత్తితో దాడి చేసి హత్య చేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నగరంలోని కోకాపేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తపై భార్య కూరగాయల కత్తితో దాడి చేసి చంపేసింది. బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త వేధింపులకు గురిచేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు వాగ్వాదానికి దిగారు.
చివరకు భర్త వేధింపులు తాళలేక విచక్షణ కోల్పోయిన భార్య.. అతడిపై కత్తితో దాడి చేసింది. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న స్థానికులు లోపలికి వచ్చి చూడగా భర్త రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే భర్తను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నార్సింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్
మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News