Hyderabad: మార్వాడీ హఠావోకు నేను వ్యతిరేకం..
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:53 AM
మార్వాడీ హఠావో నినాదానికి తాను వ్యతిరేకమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ ఆల్‌మైసన్ విల్లాలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనమంతా భారతీయులం.
హైదరాబాద్: మార్వాడీ హఠావో నినాదానికి తాను వ్యతిరేకమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanmantha Rao) అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ ఆల్‌మైసన్ విల్లాలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనమంతా భారతీయులం. దేశంలోని ప్రజలందరూ ఏ రాష్ట్రంలోనైనా బతకవచ్చ’ని ఆయన అన్నారు. విదేశాల్లో భారతీయులు చాలా ఉంది ఉన్నారని,

ఎన్నో ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వారూ ఉన్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియా అని, వివిధ రాష్ట్రాలకు చెందిన వారంతా హైదరాబాద్(Hyderabad)లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని అన్నారు. కులాలు, మతాల వారిగా విడిపోతే నష్టపోయేది దేశ ప్రజలేనని అన్నారు. అందరం కలిసి సమైక్యంగా ఉందామని పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న భారతీయులను ఆ దేశపు వారు వెళ్లగొడితే ఏంటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News