TG NEWS: హైదరాబాద్‌లో అమానుషం.. యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:10 AM
ఓ యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
హైదరాబాద్: ఓ యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివేకానంద నగర్‌లోని వడ్డెపల్లి ఎన్‌క్లేవ్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగుల చేతిలో చనిపోయిన యువకుడిని బోరబండ (Borabanda) ప్రాంతానికి చెందిన వాహిద్ పైల్వాన్ కుమారుడు సయ్యద్ షాహెద్‌గా (Syed Shahed) పోలీసులు గుర్తించారు.
యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలం దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సయ్యద్ షాహెద్‌కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలు
పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు
Read Latest Telangana News And Telugu News