TG GOVT: వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:00 PM
మహిళా స్వయం సహయక సభ్యుల ప్రమాద బీమా పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. SHG సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించింది.
హైదరాబాద్: మహిళా స్వయం సహయక సభ్యుల ప్రమాద బీమా పథకంపై (Telangana SHG Scheme) తెలంగాణ ప్రభుత్వం (Telangana GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. SHG సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలుని కొనసాగించాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి ప్రమాద బీమా వచ్చింది. ప్రమాదవశాత్తూ మరణించిన SHG సభ్యులకు రూ.10 లక్షల వరకు బీమాని ప్రభుత్వం అందజేస్తోంది. కష్టకాలంలో SHG కుటుంబాలకు భరోసాగా ప్రమాద బీమా ఉంటుంది. ఇప్పటికే 409 మందికి రేవంత్ ప్రభుత్వం ప్రమాద బీమా మంజూరు చేసింది. ప్రమాద బీమా ఇస్తున్న ధీమాతో SHGలో మహిళలు చేరుతున్నారు. ఇప్పటివరకు 1.67 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలోనే ప్రమాద బీమాను మరో నాలుగేళ్ల పాటు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
వరంగల్ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News