Telangana Praja Palana: నేడు ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:10 AM
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగరవేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జి మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగరవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ వరంగల్‌లో, అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్‌లో, భద్రాద్రి కొత్తగూడెం తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్‌నగర్ జూపల్లి కృష్ణారావు, ములుగు సీతక్క, రంగారెడ్డిలో శ్రీధర్‌బాబు, సంగారెడ్డిలో దామోదర రాజనర్సింహా జెండా ఎగరవేయనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తుండగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరై జాతీయ జెండా ఎగరవేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు