Local Body Elections: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:37 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది.
హైదరాబాద్,నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు రేవంత్ సర్కార్ తెర దింపింది. తాజాగా ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.
రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ప్రకారం బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాల్లో 23 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
Read Latest Telangana News And Telugu News