Telangana Govt: జీహెచ్‌ఎంసీ పరిధి భారీగా విస్తరణ.. 27 మున్సిపాలిటీలు విలీనం
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:15 PM
జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్‌లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.
హైదరాబాద్, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ (TCUR) విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్‌లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ విలీనం చేయనుంది. విలీన ప్రక్రియ మార్పులు ఈరోజు(బుధవారం) నుంచి అమల్లోకి వచ్చాయని ప్రకటించింది.
ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగం కానుంది. ఈ మేరకు కోర్ అర్బన్ రీజియన్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీని ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు.
కాగా, జీహెచ్‌ఎంసీలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు విలీనంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 27 మున్సిపాలిటీల్లో రికార్డ్స్ స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా రికార్డ్స్ ప్రొఫార్మ రూపొందించి పంపించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్. 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల బాధ్యతల జాబితా విడుదల చేస్తూ జీహెచ్‌ఎంసీ కమీషనర్ కర్ణన్ ఇవాళ(బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
For More TG News And Telugu News