Fee Reimbursement Strike Ends: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:03 PM
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ సోమవారం నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి.
హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు చెల్లించాలంటూ ఇవాళ్టి(సోమవారం) నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమస్య పరిష్కారంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో మంత్రులు సమావేశం అయ్యారు.
ఈ మేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా ముగిసినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి(Bhatti Vikramarka) తెలిపారు. బంద్ విరమణకు ప్రైవేట్ కాలేజీలు అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు యథావిధిగా తెరచుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News