CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:26 PM
వందరోజుల ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మెగా ప్రాజెక్ట్స్‌పైన మంత్రి వర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్ట్స్‌పైన చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. ఇవాళ(శనివారం) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండ్రస్టీస్ నిఖిల్ చక్రవర్తి, టీజీఐసీసీ వైస్ చైర్మన్ శశాంక హాజరయ్యారు. ఈ సందర్భగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
డేటా సెంటర్ల ఏర్పాటుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్టానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్స్‌ను నియమించుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
స్పోర్ట్స్ క్యాంప్లెక్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ప్ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మెగా ప్రాజెక్ట్స్‌పైన మంత్రి వర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్ట్స్‌పైన చర్చించాలని నిర్దేశించారు. 2024లో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్ వచ్చాయని తెలిపారు. 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్ వచ్చాయని.. మరిన్ని సెంటర్స్ వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. వందరోజుల ప్రణాళికని సిద్ధం చేసుకొని అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News