Share News

ABN AndhraJyothi 16th Anniversary: ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు..

ABN , Publish Date - Oct 15 , 2025 | 08:48 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 16 సంవత్సరాలుగా నిబద్ధతతో వార్తలందిస్తున్న ఏబీఎన్ ఛానెల్‌కు ఆయన శుభాభినందనలు చెప్పారు.

ABN AndhraJyothi 16th Anniversary: ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
ABN AndhraJyothi 16th Anniversary

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవం (ABN AndhraJyothi 16th Anniversary) పురస్కరించుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. 16 సంవత్సరాలుగా నిబద్ధతతో వార్తలందిస్తున్న ఏబీఎన్ ఛానెల్‌కు ఆయన శుభాభినందనలు చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా మీడియా రంగంలో వస్తున్న ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 23 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానెల్ తెలుగు పాఠకుల్లో చెరగని ముద్రవేశాయని రేవంత్ ప్రశంసించారు. ప్రజల పక్షాన నిలబడి 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఏబీఎన్ ఛానెల్ భవిష్యత్తులో మరింతగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో (Telangana CMO) ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 08:54 PM