Share News

Hyderabad: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ

ABN , Publish Date - May 07 , 2025 | 08:59 AM

భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించరు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

Hyderabad: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ
CM Revanth Reddy

హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహిస్తారు. సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్​ మేనేజ్మెం​ట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరపనున్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Also Read: భారత్ ఆపరేషన్‌ సింధూర్.. Live


కాగా గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సేనలు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన కచ్చితమైన దాడులలో సుమారు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో.. కొట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్, మురిద్కే, అహ్మద్‌పూర్ ఈస్ట్ సహా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాడులు జరిపినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌

యుద్ధ సన్నద్ధతకుసైరన్‌

For More AP News and Telugu News

Updated Date - May 07 , 2025 | 09:48 AM