Share News

Ramachandra Rao: భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు

ABN , Publish Date - Nov 21 , 2025 | 02:58 PM

భారతదేశంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందుకే..

Ramachandra Rao: భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు
Ramachandra Rao

హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) సూచించారు. ప్రజల ఆలోచనా స్వదేశీ వస్తువులని వినియోగించేలా ఉండాలని కోరారు. భారతదేశం ఇతర దేశాల వస్తువుల మీద ఆధారపడకూడదని ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.


ఇవాళ( శుక్రవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో రామచంద్రరావు, బీజేపీ నేతలు చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. యాంటీ ఇండియా ఐడియాలజీ ఉన్నవారికి కాంగ్రెస్ నిన్న ఇందిరా గాంధీ అవార్డులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు.


2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మనమందరం ముందుకెళ్లాలని సూచించారు. చైనా, అమెరికా తమ ఉత్పత్తులను పెంచి.. ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని విమర్శించారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ స్వదేశీ ఆయుధాలతో జరిగిందని.. అందుకే ఈ ఆపరేషన్ అంత సక్సెస్ అయ్యిందని రామచంద్రరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్

ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 04:48 PM