GHMC Notices: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:25 AM
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 21: అన్నపూర్ణ స్టూడియో (Annpurna Studio), రామానాయుడు స్టూడియోలకు (Ramanaidu Studio) బల్దియా (GHM) బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు పంపారు.
కాగా.. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
కలెక్టరేట్‌లో నీళ్లు కరువాయే...
డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం
Read Latest Telangana News And Telugu News