Hyderabad Collectorate: కలెక్టరేట్‌లో నీళ్లు కరువాయే...
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:16 AM
హైదరాబాద్ కలెక్టరేట్‌లో నీటి ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం లిఫ్ట్ పాడైపోయి అవస్థలు పడిన అధికారులు, ఉద్యోగులు తాజాగా పది రోజులుగా నీటి సరఫరా కరువై సతమతమవుతున్నారు.
- పది రోజులుగా కటకట
- అత్యవసరాలకూ ఇబ్బందులు
- ప్రజావాణిలో ఉద్యోగుల మొర?
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ కలెక్టరేట్(Hyderabad Collectorate)లో నీటి ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం లిఫ్ట్ పాడైపోయి అవస్థలు పడిన అధికారులు, ఉద్యోగులు తాజాగా పది రోజులుగా నీటి సరఫరా కరువై సతమతమవుతున్నారు. నీళ్లు లేక అత్యవసరాలకు కూడా పడరాని పాట్లు పడుతున్నారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు.

పైపులైన్ లీకేజీ(Pipeline leakage) కారణంగా నీటిని నింపకపోవడంతో రోజంతా సతమతమవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్లు లేవని వాపోతున్నారు. నీటి సమస్యపై గత సోమవారం జరిగిన ప్రజావాణిలో ఉన్నతాధికారులకు పలువురు అధికారులు నీటి సమస్యపై మొర పెట్టుకున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News