Today Gold And Silver Rates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:19 AM
బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. పుత్తిడి ధర బాగానే తగ్గింది. అదే వెండి మాత్రం భారీగా తగ్గింది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా తగ్గింది.
గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నిన్న అంటే.. గురువారం కాస్తా పెరిగింది. ఇక శుక్రవారం.. ఈ రోజు (నవంబర్ 21) మరి కాస్తా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 260కి చేరింది. ఇదే బంగారం నిన్నటి ధర రూ.1,24, 860గా ఉంది. అంటే రూ. 600 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 13, 900కి చేరింది. ఇదే బంగారం నిన్నటి ధర రూ. 1,14, 450 గా ఉంది. అంటే రూ. 550 తగ్గింది. (live gold rates).
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1, 24, 410కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1, 14, 050 కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 260గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 1, 13, 900కి దిగింది (Gold price in Hyderabad). వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే అవి కూడా భారీగా తగ్గాయి. ఎంతగా అంటే.. రూ. 3000 తగ్గింది. ఈ నేపథ్యంలో పుత్తడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు.. శుభ శుక్రవారమనే చెప్పాలి. ఆ క్రమంలో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే (gold market updates)..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు.. 24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
విజయవాడలో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
ఢిల్లీలో రూ. 1, 24, 410, రూ. 1, 14, 050
ముంబైలో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
వడోదరలో రూ. 1, 24, 310, రూ. 1, 13, 950
కోల్‌కతాలో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
చెన్నైలో రూ. 1, 25, 460, రూ. 1, 15, 000
బెంగళూరులో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
కేరళలో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
పుణెలో రూ. 1, 24, 260, రూ. 1, 13, 900
ప్రధాన నగరాల్లో వెండి ధరలు కేజీల్లో..
హైదరాబాద్‌లో రూ. 1, 73, 000
విజయవాడలో రూ. 1, 73, 000
ఢిల్లీలో రూ. 1, 65, 000
చెన్నైలో రూ. 1, 73, 000
కోల్‌కతాలో రూ. 1, 64, 900
కేరళలో రూ. 1, 73, 000
ముంబైలో రూ. 1, 64, 900
బెంగళూరులో రూ. 1, 64, 900
వడోదరలో రూ. 1, 65, 000
అహ్మదాబాద్‌లో రూ. 1, 64, 900
ఈ వార్తలు కూడా చదవండి..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
For More Business News And Telugu News
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాల్సి ఉంటుందని సూచన.