Indian Stock Market: రెండో రోజూ కొనసాగిన ర్యాలీ
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:01 AM
స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల బాట పట్టింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ చివరికి 446.21 పాయింట్ల లాభంతో...
26,100 పాయింట్ల పైన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల బాట పట్టింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ చివరికి 446.21 పాయింట్ల లాభంతో 85,632.68 వద్ద ముగిసింది. నిఫ్టీ చివరికి 139.50 పాయింట్ల లాభంతో 26,192.15 వద్ద క్లోజయింది. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు, ఎంపిక చేసిన కొన్ని ఫైనాన్సియల్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు దిగడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం కూడా ఇందుకు కలిసి వచ్చింది. పెద్ద అడ్డంకులేమీ లేకపోతే ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 91,500 పాయింట్లకు చేరవచ్చునన్నది టెక్నికల్ విశ్లేషకుల అంచనా.
దూసుకుపోయిన రిలయన్స్ మార్కెట్ క్యాప్ : గురువారం రిలయన్స్ షేర్లు రేసుగుర్రంలా పరిగెత్తాయి. ఒక దశలో బీఎ్‌సఈలో షేరు ధర 2.42ు లాభంతో రూ.1,550.90ని తాకడంతో మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలో రూ.21 లక్షల కోట్లకు చేరింది. చివరికి 2.01 శాతం లాభంతో రూ1,549.10 వద్ద ముగిసింది. దీంతో షేర్ల మార్కెట్ విలువ రూ.20.96 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ రుణ సేకరణ పరిమితి పెంపు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ తన రుణ సేకరణ పరిమితిని ప్రస్తుత రూ.5,000 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన తీర్మానానికి ఈ-ఓటింగ్ ద్వారా సేకరిస్తోంది. వాటాదారులు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 20 వరకు ఈ-ఓటింగ్ ద్వారా ఈ తీర్మానానికి తమ ఆమోదం లేదా తిరస్కరణ తెలపవచ్చునని పేర్కొంది.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News