RBI Governor Malhotra: రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:04 AM
రూపాయి మారకం విలువకు ఎలాంటి లక్ష్యాన్నీ నిర్దేశించలేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్రా స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో రూపీ మారకం విలువ క్షీణించడానికి డాలర్లకు డిమాండ్...
డాలర్ డిమాండ్ వల్లే క్షీణత
ఆర్థిక స్థిరత్వానికే ప్రఽథమ ప్రాధాన్యం
క్రిప్టోలు, స్టేబుల్ కాయిన్స్‌తో ముప్పెక్కువ
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువకు ఎలాంటి లక్ష్యాన్నీ నిర్దేశించలేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్రా స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో రూపీ మారకం విలువ క్షీణించడానికి డాలర్లకు డిమాండ్ పెరగడమే ప్రధాన కారణమన్నారు. ‘‘అమెరికాతో భారత్ సానుకూలమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందన్న విశ్వాసం ఉంది. ఆ డీల్ రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశిస్తు న్నాం. అమెరికా సుంకాలు, వాణిజ్య సంబంధ కారణాలతోనే ఈ మధ్య రూపాయి విలువ గణనీయంగా క్షీణించింది’’ అని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం జరిగిన వీకేఆర్‌వీ రావు స్మారకోపన్యాస కార్యక్రమంలో మల్హోత్రా అన్నారు. ఈ ఏడాదిలో ఆసియా కరెన్సీల్లోకెల్లా రూపాయి అధికంగా క్షీణించింది. ఇప్పటివరకు రూపాయి మారకం విలువ 3.6ు పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50ు సుంకాలు, యూ ఎ్‌సతో వాణిజ్యపరమైన ఇబ్బందులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణం.
మల్హోత్రా ఇంకా ఏమన్నారంటే..
ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు భారీగానే ఉన్నాయి. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆర్థిక స్థిరత్వమే ఆర్‌బీఐ ప్రథమ ప్రాధాన్యత. వ్యవస్థ రక్షణకు ఎలాంటి భంగం కలుగకుండా నిబంధనలను సరళీకరిస్తున్నాం.
త్వరలో భారత్‌కు చెందిన మరిన్ని బ్యాంక్‌లు ప్రపంచంలోని 100 అతిపెద్ద బ్యాంక్‌ల జాబితాలో చేరతాయని ఆశిస్తున్నాం. ఆర్థిక విస్తరణ, బ్యాంకింగ్ రంగంలో వేగవంత వృద్ధి ఇందుకు దోహదపడనున్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి ఎస్‌బీఐ (43వ స్థానం), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ (73వ స్థానం) మాత్రమే ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీలు, స్టేబుల్ కాయిన్స్‌తో ముప్పు ఎక్కువ. అందుకే వాటి విషయంలో ఆర్‌బీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), ఈ- లెండింగ్ వంటి డిజిటల్ ఆవిష్కరణలను సమర్థించడంతో పాటు ప్రోత్సహించాం.
బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలను కట్టడి చేయడమే లక్ష్యంగా నకిలీ ఖాతాల ఏరివేత కోసం ప్రవేశపెట్టిన మ్యూల్‌హంటర్.ఏఐ టూల్ ఆశించిన ఫలితాలనిస్తోంది. ప్రతినెలా 20,000 వరకు నకిలీ ఖాతాను గుర్తిస్తోంది.
మల్హోత్రా కర్మ సిద్ధాంతం..
ఆర్‌బీఐ గవర్నర్ కావాలంటే ఏం చేయాలంటూ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్ధులు మల్హోత్రాను అడిగారు. అందుకు ఆయన ‘‘మీ కర్మను (విధిని) ఇష్టంతో, ఉత్సాహంతో చేయండి.. ఫలితం దానంతట అదే వస్తుంది’’ అన్నారు.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News