Share News

Underground Power Lines: భూగర్భ విద్యుత్‌ లైన్లపై స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:31 AM

అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్న 19 కొత్త సబ్‌స్టేషన్లకు వందశాతం అండర్‌ గ్రౌండ్‌ (భూగర్భ) విద్యుత్‌లైన్లతో కరెంట్‌ సరఫరా అందించే దిశగా పనులు చేపడుతోంది.

Underground Power Lines: భూగర్భ విద్యుత్‌ లైన్లపై స్పెషల్ ఫోకస్
Underground Power Lines

కొత్త సబ్‌స్టేషన్లలో 100 శాతం ఏర్పాటు దిశగా అడుగులు

సమ్మర్‌ నాటికి అందుబాటులోకి 19 సబ్‌స్టేషన్లు

ఇప్పటికే 7 చోట్ల పనులు ప్రారంభం

టెండర్ల దశలో మరో 12 భూగర్భ విద్యుత్ లైన్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లపై (Underground Power Lines) దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్న 19 కొత్త సబ్‌స్టేషన్లకు వందశాతం అండర్‌ గ్రౌండ్‌ (భూగర్భ) విద్యుత్‌లైన్లతో కరెంట్‌ సరఫరా అందించే దిశగా పనులు చేపడుతోంది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా 2026 సమ్మర్‌ నాటికి గ్రేటర్‌ పరిధిలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్లలో 19 కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించి వాటిని చార్జ్‌ చేసే దిశగా ముందుకు వెళ్తోంది.


ఇప్పటికే సాయినగర్‌, అంతాయిపల్లి, షాపూర్‌నగర్‌, జొన్నబండ, వీబీసిటీ, అత్తాపూర్‌ ఎస్టీపీ, ప్రైర్‌ ఇండియా ప్రాంతాల్లో 7 సబ్‌స్టేషన్ల పనులు ప్రారంభించారు. మరో 12 సబ్‌స్టేషన్లకు స్థలాలను గుర్తించిన దక్షిణ డిస్కం వాటికి టెండర్లు పిలిచింది. ఈ సబ్‌స్టేషన్లకు భూగర్భ విద్యుత్‌ లైన్లు వేస్తుండటంతో బడ్జెట్‌ రెండింతలు పెరుగుతోంది. అయితేరాబోవు రోజుల్లో గ్రేటర్ మొత్తంగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆదేశాలతో దక్షిణ డిస్కం ఈ దిశగా చర్యలు చేపడుతోంది.


శివారు ప్రాంతాల్లో డక్ట్ తరహాలో లైన్లు వేస్తే ప్రయోజనం

శివారు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ లైన్ల స్థానంలో ప్రత్యేకంగా రోడ్ల అడుగుభాగంలో సిమెం ట్తో డక్టు నిర్మాణాలు చేపట్టి విద్యుత్ లైన్లు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని విద్యుత్ంగ నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్లో విద్యుత్ లైన్లు, ప్రైవేట్ కేబుల్స్ సాంకేతిక సమస్యలు తలెత్తినా, తీగలు కాలిపోయినా వాటిని సులభంగా మార్చేందుకు వీలుంటుందని సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌

డ్రగ్స్‌ కేసుల్లో పబ్బులకు లింకులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 08:31 AM