Bomb Threat: కాల్పులు జరుపుతాం, బాంబు వేస్తాం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:13 PM
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. తమకు ఒక మిలియన్ ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తలు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్‌పోర్టులోని జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని మెయిల్ చేశారు. అంతేకాకుండా అమెరికా వెళ్ళే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. బెదిరింపు వచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలను ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. మెయిల్ editor@epochtimes.cpm, Phone: +1-2016143989గా గుర్తించారు.
కాగా.. ఈరోజు ఉదయం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జాస్పర్ పకార్ట్ అనే (అమెరికా న్యూయార్క్) వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేసినట్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తానంటూ బెదిరింపు మెయిల్ పెట్టాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్‌లు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు ఎయిర్ పోర్ట్‌లో అన్ని ప్రాంతాలను తనిఖీలు నిర్వహించారు. అయితే రెండో సారి కూడా అలాంటి మెయిల్ రావడంతో విమానాశ్రయ సిబ్బంది మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు
భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. హైటెన్షన్
Read Latest Telangana News And Telugu News