Telangana Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:06 PM
గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. సీఎం సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంవోయూలు కుదర్చుకుంటున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 9: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంవోయూలు కుదర్చుకుంటున్నాయి. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్.. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.
తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, సుమధుర గ్రూప్ ప్రతినిధులు.. ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి ప్రభుత్వంతో ఎంవోయూ కుద్చుకున్నారు. వీరితో పాటు అరబిందో, భారత్ బయో టెక్, హెటెరో, ఎంఎస్‌ఎన్ ఫార్మా ప్రతినిధులు కూడా సీఎంను కలిసి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. అంతేకాకుండా.. వింటేజ్ కాఫీ హౌస్, కేజే ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు, బయోలాజికల్స్ ఈ, విజ్జి ఇంక్ (యుఎస్‌ఏ) , గ్రాన్యూల్స్ ఫార్మా ప్రతినిధులు, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు వరుసగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ సంస్థలు కాంగ్రెస్ సర్కార్‌తో ఎంవోయూ చేసుకున్నాయి. అలాగే సీఎం రేవంత్‌ను ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అనివేశ్, అనలాగ్ ఏ ఐ ఓటూడ్లోజ్ ప్రతినిధులు, డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, సెంబ్ కార్ప్ (సింగపూర్) ప్రతినిధులు, తల్వాన్ గ్రూప్ ప్రతినిధులు కలిశారు.
అలాగే.. గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రితో గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణపై సీఎంతో పిరోజ్షా గోద్రెజ్ చర్చించారు. మిల్క్, ఎఫ్‌ఎమ్‌సీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అటు సీఎంను బయోవరం ఫార్మా గ్రూప్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఫార్మా/ లైఫ్ సైన్సెస్ రంగంలో కంపెనీ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్‌ఎస్‌ఎన్ గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది.
కాగా.. రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ ఉదయం 10 గంటలకు మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయమే గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు రూ.6 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అవే విగ్రహాలను అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ వర్చువల్‌గా ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి...
భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. హైటెన్షన్
హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..
Read Latest Telangana News And Telugu News