Gajjela Kantham: ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలి: గజ్జెలకాంతం
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:39 PM
రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెలకాంతం కోరారు. ఉద్యమకారుల తరుపున అద్దంకి దయాకర్‌కి మంత్రి పదవి ఇవ్వాలని, ప్రభుత్వంలో మాదిగలకు కీలక పదవులు ఇవ్వాలని గజ్జెలకాంతం డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెలకాంతం (Gajjela Kantham) కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ ఉద్యమకారుల రౌండ్‌టేబుల్ సమావేశం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో గల అశోక హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, ఓయూ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెలకాంతం మీడియాతో మాట్లాడారు.
ప్రతి ఉద్యమకారునికి రూ.25,000 పింఛన్, ఉద్యమకారుల అర్హతను బట్టి ఉద్యోగాలు కేటాయించాలని గజ్జెలకాంతం కోరారు. మాదిగలకు 2 మంత్రి పదవులు, తర్వాతే మాలలకు ఇవ్వాలని... చేవెళ్ల డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల తరుపున అద్దంకి దయాకర్‌కి మంత్రి పదవి ఇవ్వాలని, ప్రభుత్వంలో మాదిగలకు కీలక పదవులు ఇవ్వాలని కోరారు. బహుజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి తాను ముందుంటానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారని గజ్జెలకాంతం ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, ఓయూ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేతలు రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
For Telangana News And Telugu News