Share News

Revanth Reddy Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనంపై సీఎం సమీక్ష

ABN , Publish Date - Oct 22 , 2025 | 03:02 PM

రానున్న వందేళ్ల అవసరాలకు తగిన సదుపాయాలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి ఉండాలని.. ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని వెల్లడించారు.

Revanth Reddy Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనంపై సీఎం సమీక్ష
Revanth Reddy Osmania Hospital

హైదరాబాద్, అక్టోబర్ 22: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు, పలు సూచనలు చేశారు సీఎం. రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వందేళ్ల అవసరాలకు తగిన సదుపాయాలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి ఉండాలని.. ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్మాణ సమీక్ష చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.


స్థానికులకు ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఆసుపత్రుల పనుల పర్యవేక్షణకు అధికారుల నియామకం జరిగిందన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్, భద్రతా ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ ఇలంబర్తి, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

దారుణం.. కొడుకు చేతిలో తండ్రి హతం

బకాయిలు అడిగితే బ్లాక్ మెయిలా.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 03:36 PM