Rachakonda CP: రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:10 PM
సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: సీఎం రేవంత్ రెడ్డి (CM Reavanth Reddy), మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. రేవంత్, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.
రేపు (శనివారం) సాయంత్రం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని... ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు. మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని... ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.
వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు. ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రతా విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు
వాళ్లే టార్గెట్‌గా మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News