Share News

Ponnam Prabhakar Clarifies: అడ్లూరి నాకు సోదరుడు.. కలిసే ముందుకెళ్తాం: పొన్నం

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:48 AM

అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు.

Ponnam Prabhakar Clarifies: అడ్లూరి నాకు సోదరుడు.. కలిసే ముందుకెళ్తాం: పొన్నం
Ponnam Prabhakar Clarifies

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోన్న మంత్రి అడ్లూరి లక్మణ్ (Minister Adluri Laxman) ఎపిసోడ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తాజాగా ప్రకటనను విడుదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరులవంటివారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే అని చెప్పుకొచ్చారు. ‘మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. మా బంధం ఎవరు విడదీయరానిది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు’ అని తేల్చి చెప్పారు.


అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. అపార్థాల వల్ల అన్నలాంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నట్లు తెలిపారు. అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 10:53 AM