WhatsApp Status: ఇలాంటి తప్పు మళ్లీ చేయను...
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:11 AM
హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరిస్తూ జీడిమెట్ల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారి ఫోన్లలో ‘హెల్మెట్ లేకపోవడం వల్ల పోలీసులు నన్ను పట్టుకున్నారు.
- హెల్మెట్ లేని బైకర్ల ఫోన్లలో వాట్సాప్ స్టేటస్
- వినూత్న కార్యక్రమానికి జీడిమెట్ల పోలీసుల శ్రీకారం
హైదరాబాద్: హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరిస్తూ జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారి ఫోన్లలో ‘హెల్మెట్ లేకపోవడం వల్ల పోలీసులు నన్ను పట్టుకున్నారు. భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకే అని అర్ధమైంది. ఇలాంటి తప్పు మళ్లీ చేయను..’ అంటూ వాట్సాప్ స్టేటస్(WhatsApp Status)ను పెట్టిస్తున్నారు.

ఇటీవలి కాలంలో అర్ధరాత్రి వేళ హెల్మెట్ లేకుండా అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురై ఎంతో మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ మరణాలను ఆపేందుకు బాలానగర్ ఏసీపీ నరేష్‌రెడ్డి, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేని వాహనదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి ఫోన్‌తోనే ఫొటో తీసి వారి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టించారు. ఇది వాహనదారుల్లో బాధ్యతను పెంచుతుందని ఏసీపీ నరే్‌షరెడ్డి, సీఐ మల్లేష్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa