Hyderabad Weather: మరో మూడు గంటల్లో ఆ జిల్లాల్లో వర్ష బీభత్సం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:01 AM
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి... వాటి నుంచి ఇంకా బయటపడక ముందే మరోసారి వానలు దంచికొడతాయన్న వార్తలు విని ఆ ప్రాంత ప్రజలు కంగారు పడిపోతున్న పరిస్థితి.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: భాగ్యనగరంలో వర్ష బీభత్సం (Heavy Rains) కొనసాగుతోంది. నగరంపై వరణుడు విరుచుకుపడుతున్నాడు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు ఉదయం నుంచి నగరవ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇలానే ఉంటాయని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి... వాటి నుంచి ఇంకా బయటపడక ముందే మరోసారి వానలు దంచికొడతాయన్న వార్తలు విని ఆ ప్రాంత ప్రజలు కంగారు పడిపోతున్న పరిస్థితి.
ఉరుములు, మెరుపులతో...
ఓవైపు ఉదయం నుంచి గ్రేటర్‌లో వాన దండికొడుతుండగా... మరోవైపు రాగల రెండు, మూడు గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భార వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌ను వదలని వరణుడు.. మరో మూడు రోజులు ఇంతే
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
Read latest Telangana News And Telugu News