Share News

KTR On Operation Sindoor: ఆ శక్తి ఇండియన్ ఆర్మీకి ఉంది

ABN , Publish Date - May 07 , 2025 | 09:45 AM

KTR On Operation Sindoor: భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీకి ఉందని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

KTR On Operation Sindoor: ఆ శక్తి ఇండియన్ ఆర్మీకి ఉంది
KTR On Operation Sindoor

హైదరాబాద్, మే 7: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులకు దిగింది. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్‌ను ప్రతీఒక్కరూ సమర్ధిస్తున్నారు. అధికార విపక్ష నేతలు అందరూ కూడా ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ జైహింద్ అంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. భారత సెల్యూట్ చేశారు.


కేటీఆర్‌ ట్వీట్ ఇదే

‘పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీకి ఉంది. జైహింద్’ అంటూ కేటీఆర్‌ పోస్ట్ చేశారు.


ఇండియన్ ఆర్మీకి అండగా ఉందాం: కవిత

kavitha-mlc.jpg

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి భారత సైన్యం గట్టిగా సమాధానం ఇచ్చిందన్నారు. భారత సైన్యం తన సత్తాను చాటిందని కొనియాడారు. భారత సైన్యం చర్యలు అభినందనీయమన్నారు. ఇలాంటి సమయంలో పార్టీలకతీతంగా ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు భారత సైన్యానికి అండగా నిలబడి వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలని కవిత ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

India Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2025 | 10:40 AM