Laxman On Swadeshi Products: అలా ఎదగాలంటే స్వదేశీ వస్త్రాలు ఉపయోగించాల్సిందే: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:57 PM
ప్రధాని జన్ ధన్ ఖాతాలు తెరిపించి బ్యాంకులకు చేరువ చేశారని.. దిక్కు లేని వారికి మోదీ దిక్కయ్యారని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. 4 కోట్ల మందికి ఆవాసం నిర్మించారన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: దిన్ దయాళ్ ఉపాధ్యయ జయంతి సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ నివాళులర్పించారు. ఈరోజు (గురువారం) ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. దిన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన సందేశాన్ని మోదీ సాకారం చేస్తున్నారని తెలిపారు. ప్రధాని జన్ ధన్ ఖాతాలు తెరిపించి బ్యాంకులకు చేరువ చేశారని.. దిక్కు లేని వారికి మోదీ దిక్కయ్యారని చెప్పుకొచ్చారు. 4 కోట్ల మందికి ఆవాసం నిర్మించారన్నారు. మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు.. అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారని ఎంపీ పేర్కొన్నారు.
ఇతర దేశాలపై ఆధారపడకూడదని స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని పిలుపు ఇచ్చారన్నారు. అక్టోబర్ 2న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి.. చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధిలో 4వ స్థానానికి మోదీ తీసుకువచ్చారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గించారని.. గొప్ప సంస్కరణ తీసుకువచ్చారని కొనియాడారు. అమెరికా లాంటి దేశాలు టారిఫ్ పేరిట ఇబ్బందులు పెడుతున్నా.. దేశంలో అనేక స్టార్టప్ సంస్థలు తీసుకువస్తున్నారని అన్నారు. సేవ పక్వడలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2047 వరకు దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే స్వదేశీ వస్త్రాలు ఉపయోగించాలని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
Read Latest Telangana News And Telugu News