Shamshabad Airport: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Sep 25 , 2025 | 09:19 AM
ఆ సమయంలో విమానంలో మొత్తం 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో (Shamshabad Airport) ఇండిగో విమానానికి (6E-816) (Indigo Flight) పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (గురువారం) ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
Read Latest Telangana News And Telugu News