Share News

Sridhar Babu: రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదు.. మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

ABN , Publish Date - Feb 11 , 2025 | 03:00 PM

Minister Sridhar Babu:రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.

 Sridhar Babu: రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదు.. మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
Minister Sridhar Babu

రంగారెడ్డి జిల్లా (చేవెళ్ల): రామరాజ్యం పేరా అరాచకాలు సాగిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి అమానవీయ చర్య, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇవాళ(మంగళవారం) చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు పరామర్శించారు. సౌందర్య రాజన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి ఆరా తీశారు. దాడి ఘటనను అడిగి నేతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు. రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.


నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది: మహేందర్ రెడ్డి

రాముడు పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మహేందర్ రెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 03:08 PM