Messi India Tour 2025: మెస్సీ Vs రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌కి రాహుల్ గాంధీ..!
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:36 PM
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
హైదరాబాద్: నగరంలో జరగబోయే ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనేది ఓ ప్రేవేట్ ఈవెంట్ అయినప్పటికీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు ముఖ్యమంత్రి అక్కడి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈనెల 13న హైదరాబాద్ వస్తున్నారని.. ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం చెప్పారు.
ఈ కార్యక్రమానికి తననూ ప్రత్యేక అతిథిగా పిలిచారని.. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధం లేని ఈవెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెస్సీతోపాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారు. అయితే, ఈ కార్యక్రమంలో మెస్సీ వర్సెర్స్ రేవంత్ రెడ్డి జట్లు 5 నిమిషాలపాటు మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీతోపాటు ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ వస్తున్నారా, లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్
For More TG News And Telugu News