Share News

Akhanda 2 Producers:అఖండ 2 చిత్ర నిర్మాతలకు ఊరట..

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:32 PM

అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఊరట ఇచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది.

Akhanda 2 Producers:అఖండ 2 చిత్ర నిర్మాతలకు ఊరట..

హైదరాబాద్, డిసెంబర్ 12: అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఊరట ఇచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. అందరి వాదనలు వినకుండా సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిందని డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. ఈ అంశంపై తదుపరి విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

గురువారం మధ్యాహ్నం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషన్‌ను 14 రీల్స్ దాఖలు చేసింది. అఖండ-2పై సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను.. డివిజన్‌ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ చిత్ర నిర్మాతలకు కోర్టు ఊరట నిచ్చింది.


అంతకుముందు అంటే.. గురువారం ఉదయం అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తమ ఆదేశాలు ధిక్కరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలిచ్చినా ఈ సినిమా టికెట్లను ఎందుకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారంటూ బుక్‌ మై షోను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. పెంచిన ధరలతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా? లేదా? అని నిలదీసింది. మీపై ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ బుక్ మై షోను వివరణ కోరింది. మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్‌తో మళ్లీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలకు ఊరటనిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హమ్మయ్య.... పులి చిక్కిందిగా...!

డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

For More TG News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 05:35 PM