Share News

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:02 PM

ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజన్‌గా మారిందని తెలిపారు.

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్
Nara Lokesh

అమరావతి, డిసెంబర్ 12: ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. శుక్రవారం నాడు రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ సీఎం రాత్రి పది వరకు శ్రమిస్తున్నారన్నారు.


lokesh-cognizant.jpg

రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యతతో ఇతర రాష్ట్రాలు అసూయ చెందుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. కంపెనీల యాజమాన్యంతో ఎలాంటి లావాదేవీలు చేయమని.. కేవలం భూమి పూజ అలాగే రిబ్బన్ కటింగ్‌లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాబోతున్న ఐటీ కంపెనీలకు ఉద్యోగులు నిబద్ధతో పని చేయాలని సూచించారు. విశాఖ ప్రజలు రౌడీలను తరిమేశారని.. ఇప్పుడు విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజన్‌గా మారిందన్నారు. 2047 నాటికి ఏపీ బడ్జెట్ 2.4 ట్రిలియన్లకు చేరుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

lokesh-cognizant.jpg


కాగా.. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు కార్యాలయాలకు మంత్రి భూమి పూజ చేశారు. టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ లిమెడెట్‌కు శంకుస్థాపనలు చేశారు. హిల్-4లో సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్, ప్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్‌‌లకు మంత్రి లోకేష్ భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

బస్సు ప్రమాదంపై వెంటనే సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్ దినేష్ కుమార్

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 01:53 PM