Kavitha Strong Warning To BRS Leaders: ఒక రోజు సీఎం అవుతా : కవిత
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:18 PM
భవిష్యత్‌లో తాను సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీపై విచారణ చేపడతానన్నారు. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందని.. తనకు ఎప్పుడో ఒకసారి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జస్ట్ ఇది టాస్క్ మాత్రమేనని.. టెస్ట్ మ్యాచ్ ముందు ఉందన్నారు. ఇకపై తాను సైలంట్‌గా ఉండేది లేదని కుండబద్దలు కొట్టారు. తన జోలికి వస్తే బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో తాను సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీపై విచారణ చేపడతానన్నారు. 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుందని.. తనకూ ఎప్పుడో ఒకసారి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు కవిత. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. అలాగే కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన ఆరోపణలపై కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీ న్యూస్ ఏమైనా సోషల్ మీడియా అనుకున్నారా? లేక శాటిలైట్ ఛానెల్ అనుకున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అసలు ఆ విషయం గుర్తుందా? అంటూ ఆ ఛానెల్ యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేస్తే.. చెక్ చేసుకోవాలా, లేదా? అంటూ ఆ మీడియాను సూటిగా నిలదీశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తనతోపాటు తన భర్తపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని తాము దోచుకోలేదన్నారు. గత పదేళ్లలో ఎప్పుడైనా సాయం కోసం తన భర్త మీ వద్దకు వచ్చారా? అని బీఆర్ఎస్ నేతలను కవిత సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి.. వాటిని తనపై వేయాలను కోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడితే తాటా తీస్తానంటూ కవిత ఘాటుగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆటో బోల్తా ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
For More TG News And Telugu News