Road Accident: ఆటో బోల్తాపడి ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:17 PM
కొల్లూరు మండలం దోనేపూడి - వెల్లటూరు రహదారిపై అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
బాపట్ల, డిసెంబర్ 12: కొల్లూరు మండలం దోనేపూడి - వెల్లటూరు రహదారిపై అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికులతోపాటు కొబ్బరి బొండాల లోడుతో ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఇక మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దామినేడులో శాప్‌కు భారీగా భూమి కేటాయింపు.. స్పందించిన చైర్మన్ రవినాయుడు
For More AP News And Telugu News