SAAP: దామినేడులో శాప్‌కు భారీగా భూమి కేటాయింపు.. స్పందించిన చైర్మన్ రవినాయుడు
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:36 PM
తిరుపతి సమీపంలోని దామినేడులో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత సంస్థ (శాప్)కు భారీగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆ సంస్థ చైర్మన్ రవి నాయుడు స్పందించారు.
తిరుపతి,డిసెంబర్ 12: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. తిరుపతిలోని దామినేడు వద్ద ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)కు 28.37 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో క్రీడ అభివృద్ధికి భూమిని కేటాయించాలని గతంలో సీఎం చంద్రబాబుని శాప్ చైర్మన్ రవి నాయుడు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ.. తిరుపతిని స్పోర్ట్స్ కేంద్రంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. అతి త్వరలోనే స్పోర్ట్స్ సిటీని నిర్మణానికి శ్రీకారం చేపడతామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సిటీకి భూమిని కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు క్యాబినెట్ సభ్యులకు రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆటో బోల్తా ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
For More AP News And Telugu News