Mahbubnagar Hospital Issue: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. జ్వరం వచ్చిందన్న రోగికి రేబిస్ టీకా..
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:32 AM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జ్వరం వచ్చిందని ఓ రోగి ఆసుపత్రికి వస్తే..
మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ఆధునిక సౌకర్యాలు, నూతన భవనాలు, ఔషధాలు, ఆసుపత్రిలో సరిపడినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తూ.. ముందుకెళ్తున్నాయి. అయినా కూడా కొంతమంది పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటే జంకుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు. దానిలో ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యంతో సంభవించే ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల పైనా ఉన్న కొద్ది నమ్మకాన్ని కూడా పోగొట్టేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి కుక్క కాటు రేబిస్ టీకా ఇచ్చారు వైద్యులు. విషయం తెలుసుకున్న రోగికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. అయితే.. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రోగిని పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఏఎన్ఎం వల్ల పొరపాటు జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు