Share News

KTR: ఎన్ని కుట్రలైనా చేసుకోండి.. నేడు ఏసీబీ విచారణకు..

ABN , Publish Date - Jun 16 , 2025 | 08:22 AM

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేదేలేదని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

KTR: ఎన్ని కుట్రలైనా చేసుకోండి.. నేడు ఏసీబీ విచారణకు..
BRS Working President KTR

Hyderabad: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Ex Minister KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) తీవ్రస్థాయిలో ఆగ్రహం (Fire) వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపుల వలన వెనక్కి తగ్గేదేలేదంటూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న ఆరు గ్యారంటీల అమలు మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవని, ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదేలేదని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలైనా చేసుకోవచ్చునని కేటీఆర్ అన్నారు.


ఏసీబీ విచారణకు..

కాగా ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ సంస్ధ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి.. విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, క్యాబినెట్‌ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయం బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.


కేటీఆర్‌ విచారణ పూర్తయిన తర్వాత..

కేటీఆర్‌ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కేటీఆర్‌ సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేస్‌లో డిసెంబర్ 29, 2024న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2025 జనవరి 8న కేటీఆర్ ఏసీబీ విచారణ హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు విచారించారు. జనవరి 9న మరోసారి విచారణకు పిలిచారు. అయితే కేటీఆర్ సమయం కోరారు. మే 28న విచారణ హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. విదేశీ పర్యటన కారణంగా తిరిగి వచ్చిన తరువాత వస్తానని చెప్పారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశాలు కన్పిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి:

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

విశాఖ పర్యటనకు సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 16 , 2025 | 10:16 AM