Share News

Visakha Visit: విశాఖ పర్యటనకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 16 , 2025 | 07:08 AM

Visakha Visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.

Visakha Visit: విశాఖ పర్యటనకు సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

Amaravati: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోమవారం విశాఖ పర్యటనకు (Visakhapatnam visit) వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. పది నిమిషాలు ఎయిర్‌పోర్టులో గడిపిన తరువాత 10.50 గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్‌రోడ్డులోని (RK Beach Road) కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్‌ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day) ఏర్పాట్లు పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించి, మధ్యాహ్నం 12.05 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. 12.15 నుంచి 1.30 గంటల వరకు యోగా దినోత్సవంపై అధికారులతో సమీక్షిస్తారు.


మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌లో బయలుదేరి 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.


ఇవి కూడా చదవండి:

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా

పెళ్లయిన ఆమెకు మళ్లీ పెళ్లి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 16 , 2025 | 07:09 AM