Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..
ABN , Publish Date - May 17 , 2025 | 09:06 PM
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ (hyderabad) ట్యాంక్ బండ్ వేదికగా ఈరోజు (మే 17న) జరిగిన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు, అక్కడకు భారీగా చేరుకున్న యువత, విద్యార్థులు, ఆర్మీ రిటైర్ అధికారులు, మహిళలు బీజేపీ శ్రేణుల మధ్య ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమం ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా నిర్వహించారు.
ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు కూడా పాల్గొన్నారు. ఆయన ర్యాలీకి చేరుకోవడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీ, భారత్ మతాకి జై నినాదాలతో మార్మోగుతూ ట్యాంక్ బండ్ పరిసరాలను మరింత ఉత్సాహంగా మార్చింది.
విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్నారు. కొన్ని రాజకీయ శక్తులు వారికీ ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ముగింపు పలకాలని ఆయన వ్యాఖ్యానించారు.
వెంకయ్య నాయుడు ఏమన్నారంటే..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జేజేలు కొట్టాలన్నారు. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువుగా ఉన్న ఇండియా, ఇప్పటికీ ఏ దేశంపై యుద్ధానికి కాలు దువ్వలేదన్నారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఎదురు దాడి చేసినట్లు పాకిస్థాన్ ఎటాక్ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంతో వ్యవహరించారని, భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉందని పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి అసహనం
ఈ ర్యాలీ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ప్లాప్ చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన కిషన్ రెడ్డి, బీజేపీ తిరంగ్ ర్యాలీలో జరిగిన తోపులాటపై కూడా స్పందించారు. తోపులాటలో మందకృష్ణ మాదిగ కాలికి గాయం కావడంతో ఆయనను వెంటనే ర్యాలీ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి