Kaleshwaram ACB: కాళేశ్వరం కేసులో ఇంజనీర్ల ఆస్తులు సీజ్..
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:50 AM
మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల అటాచ్‌కి కూడా విజిలెన్స్‌కి ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. దీంతో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే అని తేల్చారు.
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి ఇంజినీర్ల ఆస్తుల అటాచ్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఈ నూనె శ్రీధర్ ఆస్తులను విజిలెన్స్ కమిషన్ జప్తు చేసింది. నూనె శ్రీధర్‌కు సంబంధించిన రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రిజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.110 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే ళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్‌కు చెందిన రూ.11.46 కోట్ల ఆస్తుల అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. వీటి మార్కెట్ విలువ రూ. 90 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
వీరితో పాటు మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల అటాచ్‌కి కూడా విజిలెన్స్‌కి ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. దీంతో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే అని తేల్చారు. కేసులు తేలేదాక ఆస్తుల క్రయవిక్రయాలు చేయరాదని అధికారులు ప్రకటించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో నీటిపారుదలశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు ఏసీబీ లేఖ రాసింది. అనంతరం ముగ్గురి ఆస్తుల క్రయవిక్రయాలను కట్టడి చేయనున్నారు. ఈ కేసు నుంచి బయటపడితే.. ఆస్తుల క్రయవిక్రయాలపై వారికి అధికారం వస్తుంది.
ఇవి కూడా చదవండి..
Government Policy: బాబోయ్ ఇథనాల్
TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడి