Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:13 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలో తెరపడనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ (సోమవారం) ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు పేర్కొంది.
ఈనెల 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 21 వరకు గడువు విధించింది. అలాగే స్వీకరించిన నామినేషన్లను 22వ తేదీన పరిశీలన చేయనున్నారు. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 24 వరకూ అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు