Crime News: యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ బెదిరింపులు
ABN , First Publish Date - 2025-05-16T16:39:13+05:30 IST
Illegal Affair: కారు డ్రైవర్ దాష్టీకం బయటపడింది. యజమాని వద్దే నమ్మకంగా పని చేస్తూ.. నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ యజమానిని బెదిరించాడు.
హైదరాబాద్, మే 16: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కారు డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్ దాష్టీకం బయటపడింది. యజమాని భార్యతో కారు డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. యజమానిని భారీగా నగదు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించిన వీడియోలు సైతం బయట పెడతానంటూ యజమానిని తరచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అలా చేయకుండా ఉండాలంటే.. తనకు రూ. కోటి నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అలాగే భార్యకు సైతం విడాకులు ఇవ్వాలంటూ యజమానిని బెదిరిస్తున్నాడు. అలా చేయని పక్షంలో ఆ వీడియోలు బయట పెడతానని యజమానిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో సదరు యజమాని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదే విషయంపై కొన్ని రోజులుగా యజమానిని డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అతడి భార్యతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు.. యజమాని సెల్ ఫోన్‌కు పంపాడు. వీటిని అతడి భార్యకు చూపించేందుకు యజమాని ప్రయత్నించాడు. అంతలోనే ఈ ఫొటోలు, వీడియోలను డ్రైవర్ డిలీట్ చేశాడు. దీంతో యజమాని మధ్యవర్తుల ద్వారా ఈ కేసు సెటిల్ చేసుకోవాలని భావించాడు. ఆ క్రమంలో మధ్యవర్తుల వద్ద తనకు రూ. కోటి చెల్లించడంతోపాటు అతడి భార్యకు సైతం విడాకులు ఇవ్వాలంటూ డ్రైవర్ డిమాండ్ చేశాడు.
రూ. కోటికి ఒక్క రూపాయి కూడా తగ్గనంటూ డ్రైవర్ భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో సదరు యజమాని విసిగిపోయి.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్‌పై పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. దాంతో డ్రైవర్ ఇఫ్తికార్ ఆహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
Konda Surekha Comments: కామన్‌గా చెప్పా.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు
MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటిఆర్ తప్పుడు ప్రచారం...
Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు
Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
Read Latest Telangana News And Telugu News