Moosapet Fire Accident: మూసాపేటలో అగ్ని ప్రమాదం.. గోడౌన్ ఆక్టివిటీస్‌పై ఆరా..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:57 PM
గోడౌన్‌లో సీజ్ చేసిన లిక్కర్‌తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్‌ను కస్టమ్స్ అధికారులు గోడౌన్‌లో భద్రపరిచారని చెప్పారు.
హైదరాబాద్: మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో ఇవాళ(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై మేడ్చల్ డీఎఫ్ఓ శ్రీనివాస్ ABNతో మాట్లాడారు. ఉదయం 8:45 నిమిషాలకు అగ్నిప్రమాదంపై కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు ఫైరింజన్లు ఘటన స్థలికి చేరుకున్నాయని చెప్పుకొచ్చారు. ఆరు ఫైర్ వాహనాలు, నలభై మంది ఫైర్ ఫైటర్స్ రెండు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేశామని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించడం వల్ల ఎక్కువ నష్టం వాటిల్ల లేదని అన్నారు. గోడౌన్ ఆక్టివిటీస్‌పై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
గోడౌన్‌లో సీజ్ చేసిన లిక్కర్‌తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్‌ను కస్టమ్స్ అధికారులు గోడౌన్‌లో భద్రపరిచారని చెప్పారు. కాగా, మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. కస్టమ్స్ క్లియర్ కాని లిక్కర్‌ను కస్టమ్స్ అధికారులు గోడౌన్‌లో భద్ర పరిచారు. లిక్కర్ భద్రపరిచిన గోడౌన్‌లోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే గోడౌన్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్