MLA Raja Singh: బీజేపీ అధ్యక్ష పదవి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:52 PM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై (Telangana BJP President Post) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది పార్టీ అగ్రనేతల ఇష్టమని చెప్పారు. తాను 1995 నుంచి 2009 వరకు హిందూవాహినిలో ఫిజికల్ చీఫ్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) బీజేపీ కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. 2009లో మున్సిపల్ కార్పొరేషన్ టికెట్‌ని తాను మంగళ్‌హట్ డివిజన్ నుంచి బీజేపీ నేతలను అడిగితే ఇవ్వలేదని అన్నారు. బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీ తరఫున టికెట్ తీసుకొని ఆ సమయంలో కొట్లాడానని.. ఆ తర్వాత టీడీపీ కార్పొరేటర్‌గా గెలిచానని గుర్తుచేసుకున్నారు రాజాసింగ్.
2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత గోషామహల్ అసెంబ్లీ నుంచి తాను పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని రాజాసింగ్ తెలిపారు. హిందూ ధర్మసేవా గురించి ఎన్నోసార్లు మాట్లాడనని చెప్పారు. 1998, 2010, 2012లో పలుమార్లు జైలుకి వెళ్లానని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 77 రోజులు తాను జైలుకి వెళ్లానని వెల్లడించారు. హిందూ రాష్ట్రం, హిందూ ధర్మరక్షణ, గోరక్షణ ఇదే తన సంకల్పమని ఉద్ఘాటించారు. తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరని తనకు కూడా తెలుసు కానీ ప్రయత్నం చేస్తే తప్పేముందని అన్నారు. నామినేషన్ డేట్ డిక్లేర్ అయిన తర్వాత దీనికి సంబంధించి తాను కూడా నామినేషన్ వేయ్యాలా వద్దా అని ఆలోచిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News