BREAKING: కవితకు బీఆర్ఎస్ కౌంటర్..
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:15 PM
మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొందరు ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షణగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థులకు ఊతం ఇచ్చేలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని సూచించారు. శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు మొదటి నుంచి పార్టీలో ఉన్నారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. బ్రహ్మం గారికి సిద్ధప్ప లాగా కేసీఆర్‌కు హరీష్ రావు అని చెప్పుకొచ్చారు. జలదృశ్యంలో పార్టీ గద్దె కడిదే.. జెండా కట్టింది హరీశ్ రావు అని తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ ఎపిసోడ్‌లో హరీష్ పాత్ర లేదని స్పష్టం చేశారు. దాన్ని హరీష్‌కు ఆపాదించడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈటెల వెళ్లకుండా చివరి వరకు ప్రయత్నం చేసిన వ్యక్తి హరీష్ రావు అని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను హరీష్‌రావు మొక్కారు అనడం అబద్ధమని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఆరోపణలను ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు సంతోష్‌రావు వ్యక్తిగత సహాయకుడు మాత్రమే అని వివరించారు. ఎవరి లాభం కోసం హరీష్‌రావును టార్గెట్ చేస్తున్నారు..? అని నిలదీశారు. కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్‌రావు సహా అందరం బాధపడ్డామని గుర్తు చేశారు. ఎవరో చెబితే తప్పుదారి పట్టేంత బలహీనుడుకాదు కేసీఆర్ కాదని నొక్కి చెప్పారు. కేసీఆర్‌ను ఎవరూ తప్పుదారి పట్టించలేరని ఉద్ఘాటించారు. కేసీఆర్ అలాంటి నాయకుడైతే తెలంగాణ సాధించేవారా..? అని నిలదీశారు. వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు సరికాదని నిరంజన్ రెడ్డి హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత