Pista House: పిస్తాహౌజ్ రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల కొరడా..
ABN , Publish Date - Aug 12 , 2025 | 09:38 PM
పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను రెస్టారెంట్ల నిర్వాహకులు వాడుతున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: నగరంలోని పిస్తాహౌజ్ రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝలిపించారు. నగరంలో ఉన్న 25 పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. 23 రెస్టారెంట్లలో నుంచి శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. పిస్తాహౌజ్ రెస్టారెంట్లు ఫుడ్‌సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను రెస్టారెంట్ల నిర్వాహకులు వాడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్‌వెజ్ స్టోర్ చేస్తున్నారని తెలిపారు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో ఏ రెస్టారెంట్ అయిన ఫుడ్‌సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నగరంలో తాము ఆకస్మీక తనిఖీలు చేపడుతున్నామని.. నగరంలోని రెస్టారెంట్లపైన ఎప్పుడైనా తనిఖీలు జరగొచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు