Share News

Hyderabad: ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య

ABN , Publish Date - Feb 09 , 2025 | 09:50 AM

Velamati Janardhana Rao: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో విషాద ఘటన జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి గొడవల నేపథ్యంలో తన మనవడే తాతయ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దనరావు  దారుణ హత్య
Velamati Janardhana Rao

హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత మనవడే ఆస్తికోసం జనార్దన్ రావుని హత్య చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆస్తికోసం గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తాతపై మనువడు కీర్తి తేజ పగను పెంచుకున్నారని చెప్పారు. ఆ కారణంగానే హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు. 73 సార్లు జనార్దన్ రావును కత్తితో మనవడు కీర్తి తేజ పొడిచి చంపారని అన్నారు. మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని కసితో కీర్తి తేజ తన తాతయ్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవడమే కారణం..

‘‘ఇటీవల తన కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్‌ను జనార్దన్ రావు ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తి తేజ తన తాతయ్యను డిమాండ్ చేశాడు. కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టును జనార్దన్ రావు ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కసితో కీర్తి తేజ చంపాడు. జనార్దన్ రావు ను చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై 12సార్లు కీర్తి తేజ పొడిచాడు. తల్లి, తాత అరుపులు విని ఇంట్లోకి స్థానికులు వెంటనే వచ్చారు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తి తేజ తల్లి కొట్టుమిట్టాడారు. కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసి కీర్తి తేజ ఏలూరు పారిపోయాడు. టీటీడీకి గతంలో రూ.40 కోట్లకు పైగా విరాళాలను జనార్దన్ రావు ఇచ్చారు. ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్‌గా జనార్దన్ రావు కొనసాగుతున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను జనార్దన్ రావు కలిగి ఉన్నారు’’ అని పోలీసులు తెలిపారు.


పక్కా ప్లాన్ ప్రకారమే హత్య..

అయితే, జనార్దన్ రావుకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. జనార్దన్ రావు రెండో కూతురు కొడుకు కీర్తి తేజ హత్య చేశాడు. 2018లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు కీర్తి తేజ వచ్చాడు. జనార్దన్ రావుకు పాషా మైలారం, బాలానగర్, పటాన్ చెరువు ప్రాంతంలో వెల్జాన్‌ గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. పాషా మైలారంలోని వెల్జాన్ కంపెనీలో కీర్తి తేజ పనిచేస్తున్నాడు. జనార్ధన్‌ ఇంట్లోనే కీర్తి తేజ తల్లి సరోజినీ దేవి నివసిస్తున్నారు. గత కొంతకాలంగా తల్లి, తాతకు దూరంగా కీర్తి తేజ ఉంటున్నాడు. ప్లాన్ ప్రకారమే ఇంటికి వచ్చి తాతను కీర్తి తేజ దారుణంగా హత్య చేశాడు. అడ్డువచ్చిన తల్లిని ఆరుసార్లు కత్తితో కీర్తి తేజ పొడిచాడు. జనార్దన్‌ను 73 సార్లు కత్తితో పొడిచినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. బీమా జువెలరీస్ దగ్గర కీర్తి తేజను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పోలీసులు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 12:16 PM