KP Chowdhary: సినీనిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:05 PM
KP Chowdhary: డ్రగ్స్ కేసులో సంచలనం సృష్టించిన కేపీ చౌదరి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆనారోగ్య కారణాలతోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: సినీ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఇవాళ(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు. ఆనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా కేపీ చౌదరి ఉన్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ అందజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని గతంలో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసుల దర్యాప్తు చేశారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో టెన్షన్ పడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం..
Vasant Panchami.. బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and Telugu News